Sun Mar 15 2026 10:20:37 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు రెండు జిల్లాలకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటన సాగుతుంది. ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రచారానికి బయలుదేరుతారు.
జగ్గంపేట, ఎస్‌కోట సభల్లో...
అనంతరం కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే జగ్గంపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తర్వాత విశాఖపట్నం జిల్లాలోని శృంగవరపు కోటలో సభలో పాల్గొంటారు. టీడీపీ అధినేత రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాడర్ , లీడర్లలో జోష్ నింపుతూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

