Mon Mar 16 2026 23:03:11 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు రెండుజిల్లాల్లో ప్రజాగళం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆయన ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరసగా ప్రజాగళం పేరిట చంద్రబాబు జనంలోకి వెళుతున్న సంగతి తెలిసిందే.
రెండు నియోజకవర్గాల్లో...
ఈరోజు ఉదయం పదకొండు గంటలకు గూడూరుకు చేరుకుంటారు. అక్కడ మహిళలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సర్వేపల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ప్రజాగళం సభలో పాల్గొంటారు. రాత్రికి అమరావతికి చేరుకుంటారు.
Next Story

