Thu Mar 19 2026 15:35:14 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. రా కదలిరా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన జిల్లాలకు వస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్దయెత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు కర్నూలు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి రాజమండ్రికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరిగే రా కదలిరా సభలో పాల్గొంటారు.
రాజమండ్రి, గుంటూరు...
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లాకు చేరుకుంటారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో రా కదలిరా సభ లో ఆయన పాల్గొననున్నారు. గుంటూరు - తెనాలి ప్రధాన రహదారిలోని నారా కోడూరు సమీపంలోని వడ్లమూడి క్వారీ సెంటర్ లో ఈ సభ జరగనుంది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్దయెతున పార్టీ శ్రేణులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు సభలలో జనసేన నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనాలని ఆ పార్టీ నేతలు పిలుపు నిచ్చారు.
Next Story

