Thu Mar 19 2026 07:19:47 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు తిరుపతి జిల్లాకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. గంగాధర నెల్లూరులో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. రా కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న చంద్రబాబు నేడు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ టీడీపీకి గెలుపు లభించలేదు.
మూడు దశాబ్దాలుగా...
1983, 1994లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఈ నియోజకవర్గాన్ని తన పర్యటనకు ఎంచుకున్నారు.మధ్యాహ్నం విజయవాడ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ఇక్కడకు చేరుకుంటారు. మూడు నుంచి సాయంత్రం నాలుగున్న గంటల వరకూ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు.
Next Story

