Tue Mar 17 2026 07:31:34 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు అనంతపురం జిల్లాకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన నిన్నటి నుంచి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసందే. ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు రాప్తాడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం బుక్కరాయసముద్రం సబ్ స్టేషన్ వద్ద బహిరంగ సభను నిర్వహిస్తారు.
బహిరంగ సభల్లో...
సాయంత్రం కదిరిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రజాగళం యాత్ర కు సంబంధించిన షెడ్యూల్ ను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. నిన్న పలమనేరు, నగిరిలో పర్యటించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
Next Story

