Sun Mar 22 2026 08:45:40 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు "వరద" పర్యటన నేడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. వరద బాధితులను పరామర్శిస్తారు. తమను తెలంగాణలో కలపాలని కోరుతున్న వారికి భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటించనున్నారు.
భద్రాద్రిలో బస...
ఈరోజు ఉదయం బయలుదేరి 12 గంటలకు వేలూరుపాడు మండలం శివకాశిపురం పాఠశాలలో ఉన్న వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారు. వారికి ప్రభుత్వం నుంచి అందిన సాయంపై ఆరా తీస్తారు. అలాగే మూడు గంటలకు కుక్కునూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. సాయంత్రం భద్రాద్రి జిల్లాలో బూర్గంపహాడ్ చేరుకుని అక్కడ వరద బాధితులను కూడా పరామర్శిస్తారు. రాత్రికి భద్రాచలం లో చంద్రబాబు బస చేస్తారు. రేపు విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుంది.
Next Story

