Thu Mar 19 2026 17:21:50 GMT+0530 (India Standard Time)
నేడు తూర్పుగోదావరి జిల్లాకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలోనే పర్యటించనున్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 17వ తేదీ వరకూ ఆయన పర్యటన కొనసాగుతుంది.
రోడ్ షోలు.. బహిరంగసభలు...
ఈ సందర్భంగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకునే చంద్రబాబు అక్కడి నుంచి మధురపూడి, బూరుగుపూడి, కోరుకొండ మీదుగా గోకవరం చేరుకుంటారు. దేవీ చౌక్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలలు మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జగ్గంపేటకు చేరుకుంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రేపు పెద్దాపురం నియోజకవర్గంలో, ఎల్లుండి అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుకు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story

