Sun Mar 15 2026 07:20:39 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు సిక్కోలులో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఈరోజు రెండు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నిన్న విశాఖ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారు.
నేతలతో సమావేశం...
అనంతరం పలాసలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఈరోజు రాత్రికి పలాసలోనే చంద్రబాబు బస చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు, పార్టీ అభ్యర్థులతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు సభకు పెద్దయెత్తున ఏర్పాట్నలు శ్రీకాకుళం జిల్లా నేతలు చేశారు.
Next Story

