Fri Dec 26 2025 13:38:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పెందుర్తికి చంద్రబాబు
నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో పర్యటించనున్నారు

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పెందుర్తికి రానున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పెందుర్తిలో టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు పెందుర్తి, రేపు ఎస్ కోట, ఎల్లుండి అనకాపల్లిలో చంద్రబాబు పర్యటిస్తారు.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి...
చాలా రోజుల తర్వాత చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్నారు. జీవో నెంబరు 1ని హైకోర్టు రద్దయిన తర్వాత తొలి సారి ఆయన పెందుర్తిలో పర్యటించనున్నారు. పెద్దయెత్తున జనసమీకరణ చేయడానికి టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉత్తరాంధ్ర నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

