Wed Mar 18 2026 07:26:21 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు నంద్యాల జిల్లాలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాగళం సభలో ఆయన పర్యటిస్తున్నారు వరస పర్యటనలతో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలతో ఆయన జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
డోన్, నందికొట్కూరు సభల్లో...
ఈరోజు చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ ప్రజ.ాగళం సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం నందికొట్కూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు ఉమ్మడి మ్యానిఫేస్టో విడుదలవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈరోజు వరస పర్యటనలతో ప్రజలను ఆకట్టుకుంటూ, ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ముందుకు వెళుతున్నారు.
Next Story

