Sun Mar 22 2026 04:03:08 GMT+0530 (India Standard Time)
నేడు కుప్పానికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కుప్పం నియోజకవర్గానికి వెళతారు.
మూడు రోజుల పాటు...
ఈరోజు పార్టీ నేతలతో అక్కడ సమావేశంలో పాల్గొంటారు. బాదుడే బాదుడు అనే కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యకర్తలతో నేరుగా సమావేశం కూడా నిర్వహించనున్నారు. తిరిగి శుక్రవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.
Next Story

