Mon Mar 23 2026 12:56:38 GMT+0530 (India Standard Time)
నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఈ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం మండలం దేవరాజపురం నుంచి ఈరోజు జరగనున్న రోడ్ షో లో చంద్రబాబు పాల్గొననున్నారు. రామకుప్పం మండలంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.
మూడు రోజులు....
మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళుతున్నారు. ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి క్యాడర్ లో చంద్రబాబు జోష్ ను నింపనున్నారు. ఆయన పర్యటనకు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

