Fri Dec 05 2025 20:19:03 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజులు కుప్పంలోనే చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 24, 25, 26 తేదీలలో ఆయన కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన కుప్పం నియోజకవర్గంలో సాగనుంది. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు ఇటీవల తరచూ పర్యటిస్తున్నారు. అధికార వైసీపీ తన నియోజకవర్గంపై దృష్టి పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి ఓటమి ఎదురు కావడంతో ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించక తప్పడం లేదు.
ప్రతి రెండు నెలలకు...
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. అక్కడే సొంత ఇంటిని నిర్మించుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో కుప్పం అభ్యర్థిగా భరత్ ను ప్రకటించారు. కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన మూడు రోజుల పాటు సాగనుంది. మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండి పార్టీ పరిస్థితులను చంద్రబాబు సమీక్షించనున్నారు.
Next Story

