Tue Jan 20 2026 19:33:51 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు కనిగిరికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేడు కనిగిరిలో పర్యటించనున్నారు

chandrababu naiduతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేడు కనిగిరిలో పర్యటించనున్నారు. కనిగిరిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకూ 22 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. రోజుకు రెండు చొప్పున ఈ సభలను పార్టీ నిర్వహించనుంది.
రా కదరిలా పేరిట...
రా కదలిరా పేరిట ఈ సభలకు చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా పర్యటించనున్నారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ను పార్టీ ఏర్పాటు చేసింది. నేడు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కనిగిరిలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

