Sun Mar 15 2026 04:24:32 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేటి ప్రజాగళం యాత్ర ఇలా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేడు రెండు నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగనుంది. రెండు చోట్ల ఆయన ప్రజాగళం సభలలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు.
రెండు నియోజకవర్గాల్లో...
అనంతరం తర్వాత టీడీపీ నేతలతో సమావేశమై చర్చిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ప్రత్తిపాడులో జరిగే ప్రజాగళం సభలో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దయెత్తున జనసమీకరణ చేసే దిశగా నేతలు ప్రయత్నాలను ప్రారంభించారు. వరసగా చంద్రబాబు ప్రజాగళం సభల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
Next Story

