Wed Mar 18 2026 23:56:31 GMT+0530 (India Standard Time)
Chandrababu : 18న గుడివాడకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన గుడివాడలో పర్యటించనున్నా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన గుడివాడలో పర్యటించనున్నారు. రా కదలిరా సభలో పాల్గొననున్నారు. గుడివాడలో భారీ ఎత్తున సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడలో ఈసారి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించాలన్న కసితో టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. చంద్రబాబు సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
బహిరంగ సభను...
రా కదలిరా పేరుతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గుడివాడలో సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేసే అవకాశాలున్నాయి. ఇందుకోసం పార్టీ నేతలు పెద్దయెత్తున జనసమీకరణ చేస్తున్నారు.
Next Story

