Mon Dec 08 2025 11:07:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎస్‌కోట లో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున జనాన్ని తరలించేందుకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యనేతలతో...
నిన్న పెందుర్తి సభలో పాల్గొన్న చంద్రబాబు ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వనున్నారని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే సహించనని, టిక్కెట్ కూడా ఇవ్వనని హెచ్చరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

