Thu Mar 19 2026 02:28:50 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కుప్పం నియోజకవర్గానికి బయలుదేరి వెళతారు. మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. 28,29,30 తేదీల్లో ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ లో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిచనున్నారు.
మూడు రోజుల పాటు...
అనంతరం టీడీపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రికి కుప్పం ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. 29న శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనతరం ఎంఎం ఫంక్షన్ హాలులో టీడీపీ, జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. 30వ తేదీ మధ్యాహ్నం పీఈఎస్ కురమ భవన్ వద్ద భక్త కనకదాస విగ్రహావిష్కరణ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. 4.30 గంటలకు కుప్పం మండలం మల్లనూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

