Sat Mar 07 2026 18:14:46 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు రెండు జిల్లాలకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. రా కదిలిరా సభలు మళ్లీ ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు అనకాపల్లి, ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆయన పర్యటించున్నారు. ఈరోజు ఉదయం మాడుగiలలో జరిగే రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే ఏలూరు పరిధిలోని చింతలపూడిలో జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు.
మాడుగుల, చింతలపూడి....
కొద్ది రోజుల క్రితం రా కదలిరా సభలను ప్రారంభించిన చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో కసరత్తు చేసేందుకు కొంత గ్యాప్ తీసుకున్నారు. తిరిగి నేటి నుంచి బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రా కదలిరా సభలు ఇప్పటికే 17 నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల్లో సభలను నేటి నుంచి నిర్వహించనున్నారు.
Next Story

