Thu Jan 29 2026 01:47:13 GMT+0000 (Coordinated Universal Time)
Prajagalam:నేడు చంద్రబాబు ప్రజాగళం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేట ి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు

Prajagalam:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేట ి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. గత రెండు రోజుల నుంచి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్నారు. తనకు ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈరోజు ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనను మొదలుపెట్టనున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ఈ యాత్రను నిర్వహించనున్నారు.
31వ తేదీ వరకూ షెడ్యూల్...
రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగేలా పార్టీ ఏర్పాట్లు చేసింది. కుప్పం నుంచి బయలుదేరి నేడు తొలి సభను పలమనేరు నుంచి ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి పుత్తూరులో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ చంద్రబాబు ప్రచార పర్యటన షెడ్యూల్ విడుదలయింది. రాయలసీమ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని తొలిసారి నిర్వహించనున్నారు.
Next Story

