Tue Jan 14 2025 03:07:52 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : 26 నుంచి ప్రజాగళం.. చంద్రబాబు జిల్లాల పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు
![chandrababu, tdp incharge, songa roshan kumar, chintalapudi chandrababu, tdp incharge, songa roshan kumar, chintalapudi](https://www.telugupost.com/h-upload/2024/01/29/1583758-babu.webp)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం ఇరవై రోజుల పాటు ఆయన ఏకబిగిన ప్రచారం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించడానికి రెడీ అయ్యారు.
సొంత జిల్లా నుంచి...
తొలుత చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 24, 25వ తేదీల్లో తొలుత కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం ఈనెల 25న ఆయన చిత్తూరు జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story