Sun Jan 19 2025 23:33:48 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రేపు ఉండవల్లికి చంద్రబాబు కుటుంబ సభ్యులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఉండవల్లికి చేరుకోనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఉండవల్లికి చేరుకోనున్నారు. ఎన్నికల ప్రచారానికి ముగించుకుని తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. రేపు ఏపీలో పోలింగ్ జరుగుతుండటంతో కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.
ఓటు హక్కును...
రేపు ఉదయం ఉండవల్లిలో చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా రేపు ఉండవల్లిలోనే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రచారం ముగియడంతో ఆయన హైదరాబాద్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఉదయం బయలుదేరి ఉండవల్లికి చేరుకుంటారు.
Next Story