Sun Mar 08 2026 01:31:36 GMT+0530 (India Standard Time)
Chandrababu : 12న తిరుమలకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన తిరుమలకు చేరుకుంటారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. 13వ తేదీన ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 12న ఉదయ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి తిరుమలకు సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
ప్రచారం ముగించుకుని...
చంద్రబాబు నాయుడు తన ప్రచారాన్ని ముగించుకుని తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల వెంకన్న దర్శనానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు తిరుమల వస్తుండటంతో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

