Fri Dec 05 2025 18:06:25 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు బనగానపల్లికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ప్రజాగళం యాత్రలో పాల్గొననున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ప్రజాగళం యాత్రలో పాల్గొననున్నారు. నిన్న రాప్తాడు, శింగనమల సభల్లో పాల్గొన్న చంద్రబాబు అక్కడి నుంచి నేడు బనగానపల్లికి చేరుకుంటారు. ఈ నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా నుంచి ప్రజాగళం యాత్రను ఆయన ప్రారంభించారు. రోజుకు రెండు, మూడు నియోజవకర్గాల్లో ఆయన సభలను ఏర్పాటు చేసి వైసీపీని అధికారం నుంచి గద్దెదించాలంటూ ప్రజలకు పిలుపు నిస్తున్నారు.
31వ తేదీ వరకూ...
ఈ నెల 31 వతేదీ వరకూ ఆయన పర్యటించనున్నారు. తర్వాత ఆయన పర్యటన షెడ్యూల్ విడుదల కానుంది. కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చంద్రబాబు ఈసభల ద్వారా వివరిస్తున్నారు. బనగానపల్లిలో చంద్రబాబు సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు.
Next Story

