Thu Mar 19 2026 09:47:24 GMT+0530 (India Standard Time)
నేడు గుంటూరు జిల్లా నేతలతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతం పై చంద్రబాబు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పనితీరుతో పాటు భవిష్యత్ లో పార్టీని జిల్లాలో బలోపేతం చేసే అంశంపై చంద్రబాబు చర్చించనున్నారు.
మాచర్లపైనే....
ఈ సమావేశంలో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంపై చంద్రబాబు దృష్టి పెడతారని తెలుస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో 1999లో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా టీడీపీ గెలుపునకు నోచుకోలేదు. ఇక్కడ ఇన్ ఛార్జిని కూడా ఈరోజు నియమించే అవకాశముంది. ఎవరిని చంద్రబాబు ఇన్ ఛార్జిగా నియమిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story

