Sun Feb 01 2026 22:59:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంతో ఆయన ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించనున్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై...
ప్రధానంగా పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు వంటి వాటిపై పూర్తిగా చర్చించనున్నారు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో అత్యధిక విజయం సాధించడంతో ఎక్కువ స్థానాలు దక్కించుకుని ఎన్డీఏలో కీలకంగా మారారు. దీంతో చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పనులు సాధించుకునేందుకు వీలు చిక్కింది.
Next Story

