Thu Dec 18 2025 18:01:53 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తిరుమలకు 30న చంద్రబాబు రాక
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీన తిరుమలకు రానున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీన తిరుమలకు రానున్నారు. ఆయన డిసెంబరు 1వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు తిరుమల పర్యటనకు రానున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించిన తర్వాత ఆయన కంటికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోనే ఉన్న చంద్రబాబు ఈ నెల30వ తేదీన తిరుమలకు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అన్ని ఆలయాలను...
డిసెంబరు ఒకతేదీన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమల నుంచి అమరావతికి చేరుకుంటారు. ఆ తర్వాత విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటారని పార్టీ నేతలు తెలిపారు. అలాగే సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనాలకు కూడా చంద్రబాబు వెళతారని నేతలు చెబుతున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి తిరిగి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభిస్తారని తెలిసింది. పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
Next Story

