Sat Mar 07 2026 20:43:34 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు అమరావతికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి రానున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి రానున్నారు. పార్టీ ముఖ్యనేతలతో నేడు సమావేశం కానున్నారు. విదేశీ పర్యటనకు ఈ నెల 19న బయలుదేరి నిన్న హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు నిన్నంతా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన అమరావతికి చేరుకుంటారు. గన్నవరం ఎయిర్ పోర్టులో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలకనున్నారు.
కౌంటింగ్ కు సంబంధించి...
పార్టీ నేతలతో సమావేశమై రానున్న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడారు. జూన్ 1వ తేదీన కౌంటింగ్ పై కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను చూడాలని ఆయన నేతలను ఆదేశించారు.
Next Story

