Tue Dec 30 2025 17:07:23 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నేత పై దాడి.. బాబు సీరియస్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మురళి అనే కార్యకర్తపై దాడిని చంద్రబాబు ఖండించారు. మురళిని కిడ్నాప్ చేసి మరీ దాడి చేశారని, పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇలాగే చేస్తే.....
టీడీపీలో యాక్టివ్ గా ఉన్న వారిపై దాడులు చేయడం వైసీపీకి పరిపాటిగా మారిందని చంద్రబాబు అన్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారి టీడీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మురళి ప్రాణాలకు ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story

