Tue Mar 03 2026 21:30:59 GMT+0530 (India Standard Time)
రాజ్‌భవన్ కు చంద్రబాబు.. గవర్నర్ తో భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం రాజ్‌భవన్ కు చేరుకున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం రాజ్‌భవన్ కు చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందడంతో గవర్నర్ తో చంద్రబాబు మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు తెలిసింది. రేపు ఉదయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా గవర్నర్ ను కలిసి మంత్రివర్గ కూర్పుపై ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటుతో...
ప్రభుత్వం ఏర్పాటుతో పాటు మంత్రుల కూర్పుపై కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ తో చర్చించనున్నారని తెలిసింది. ఎన్నికలలో కూటమి గెలిచిన తర్వాత, తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం చంద్రబాబు తొలిసారి గవర్నర్ తో భేటీ అయ్యారు. రాజకీయ పరమైన అంశాలతో పాటు మరికొన్ని కీలక విషయాలను కూడా ఆయన వద్ద ప్రస్తావించే అవకాశముంది.
Next Story

