Mon Mar 23 2026 23:03:21 GMT+0530 (India Standard Time)
జనసేన కార్యాలయానికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం నుంచి నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పవన్ శాలువతో సత్కరించారు. సాదర స్వాగతంపలికారు. ఇరువురు నేతలు కాసేపు ఎన్నికల ఫలితాలపై చర్చించుకున్నారు.
ఇరువురు నేతలు...
ప్రభుత్వం ఏర్పాటుపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ప్రమాణస్వీకారంతో పాటు మంత్రి వర్గంతో పాటు ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. రానున్న కాలంలో అనుసరించాల్సిన, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై అగ్రనేతలు ఇద్దరూ చర్చించుకున్నారు. ఇద్దరూ కలసి రేపు ఢిల్లీ వెళ్లే విషయంపై చర్చించినట్లు తెలిసింది. తన కుమారుడు అకీరాను చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కల్యాణ్.
Next Story

