Thu Mar 19 2026 01:42:20 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీ అధినేత టూర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పంట నష్టం పరిశీలిస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన మూడు రోజుల నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన చంద్రబాబు వారికి అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు.
కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో...
నేడు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు పర్యటనల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జన సమీకరణ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకూ చంద్రబాబు ఈ జిల్లాలోనే పర్యటించి రైతులను పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

