Sat Mar 14 2026 22:21:49 GMT+0530 (India Standard Time)
TDP : నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరస సభలతో జనంలోకి వెళుతున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరస సభలతో జనంలోకి వెళుతున్నారు. ప్రజాగళం పేరిట ఆయన జనం వద్దకు వెళ్లి ఈసారి తమ కూటమిని గెలిపించాలని కోరుతున్నారు. నిన్న విడుదల చేసిన మ్యానిఫేస్టో కు మంచి స్పందన రావడంతో మ్యానిఫేస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
రోడ్ షోలతో...
ఈరోజు చంద్రబాబు నాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గుంటూరులో జరిగే రోడ్ షోలలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం జిన్నా టవర్ సెంటర్ లో చంద్రబాబు ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలకు సంబంధించిన ఏర్పాట్లు నేతలు చేశారు.
Next Story

