Sun Mar 22 2026 10:26:27 GMT+0530 (India Standard Time)
రెండో రోజు చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురంలో పర్యటించి అనంతరం కోనసీమ జిల్లాలకు వెళతారు. అక్కడ కూడా చంద్రబాబు పర్యటిస్తారు వరద బాధితులను పరామర్శిస్తారు. నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. నిన్న పలు గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబుకు బాధితులు తమ గోడు విన్పించుకున్నారు.
కోనసీమ జిల్లాలో...
తమకు వరద సహాయం అందలేదని, తమను వరదల సమయంలో ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితులు చంద్రబాబు ఎదుట వాపోయారు. రాత్రి పాలకొల్లులో బస చేసిన చంద్రబాబు ఈరోజు రెండు జిల్లాల్లో పర్యటించి బాధితులను ఓదారుస్తారు. సాయంత్రం తిరిగి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బయలు దేరి వస్తారు.
Next Story

