Tue Mar 17 2026 18:57:49 GMT+0530 (India Standard Time)
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ ఎప్పుడంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టిక్కెట్ల కేటాయింపుపై కసరత్తులు దాదాపుగా పూర్తి చేశారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టిక్కెట్ల కేటాయింపుపై కసరత్తులు దాదాపుగా పూర్తి చేశారు. తొలి విడత జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. పొత్తుల్లో భాగంగా మిత్ర పక్షాలకు వదిలేసే సీట్లను మినహాయించి మిగిలిన వాటిల్లో కొన్నింటిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. తొలి విడతగా దాదాపు యాభై నుంచి డెబ్భయి నియోజకవర్గాలకు సంబంధించి జాబితాను ఆయన ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
వారం లోపే...
జనసేన కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనుందని తెలిసింది. జనసేన కూడా పది స్థానాల్లో అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశముంది. తొలి జాబితాను టీడీపీ, జనసేన సంయుక్తంగా విడుదల చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. అప్పుడు క్యాడర్ లో అనుకూల సంకేతాలు వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. రానున్న వారం రోజుల్లో తొలి విడత అభ్యర్థుల జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించే అవకాశాలున్నాయట్లు తెలిసింది.
Next Story

