Sat Mar 07 2026 10:51:57 GMT+0530 (India Standard Time)
Chandrababu : మూడు నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు నెలల తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు నెలల తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనకు పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ఈ ఏడాది సెప్టంబరు 9న అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
పార్టీ నేతలతో...
తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. తర్వాత ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు యువగళం ముగింపు సభపై కూడా ఆయన చర్చించనున్నారు.
Next Story

