Sun Mar 08 2026 05:45:22 GMT+0530 (India Standard Time)
Chandrababu : పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలికారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు బాణాసంచాను కాల్చి పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు.
పెద్దయెత్తున కార్యకర్తలు...
ఆయనను అభినందించడానికి పెద్దయెత్తున అభిమానులు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. సీఎం అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబుకు జేజేలు కొట్టారు. ఆయన ప్రతి ఒక్కరికీ అభివాదం చూస్తూ వారితో విజయం అందించిన ఆనందాన్ని పంచుకున్నారు. అంతకు ముందు ఉండవల్లి తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలసి విజయాన్ని చంద్రబాబు సెలబ్రేట్ చేసుకున్నారు.
Next Story

