Mon Mar 23 2026 12:58:51 GMT+0530 (India Standard Time)
వన్ సైడ్ లవ్ సురక్షితం కాదు... బాబు ఆసక్తికర కామెంట్స్
కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని కొందరు కార్యకర్తలు కోరగా దానికి చంద్రబాబు స్పందించారు. ఎన్నికలకు చలాా సమయం ఉంది కదా? అని అంటూనే లవ్ అనేది వన్ సైడ్ ఉండకూడదని, టూ సైడ్ ఉంటేనే లవ్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వన్ సైడ్ లవ్ ఎప్పుడూ సురక్షితం కాదని చంద్రబాబు అన్నారు.
ఓట్లను అమ్ముకోవద్దు....
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలలో చంద్రబాబు పాల్గొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి చంద్రబాబు కుప్పంకు రావడంతో పార్టీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. ఓట్లకు అమ్ముడు పోవద్దని, అభివృద్ధిని చూడాలని చంద్రబాబు ప్రజలను కోరారు.
Next Story

