Sat Mar 21 2026 15:01:28 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఉదయం 8.45 గంటలకు ఆయన హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. మధ్యాహ్నానికి ఆయన ఢిల్లీ చేరుకుటారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం 50 అశోకారోడ్డులోని నివాసంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు.
రాత్రికి ఢిల్లీలోనే...
అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే జీ 20 సన్నాహక సదస్సులో పాల్గొనేందుకు వెళతారు. జీ 20 సన్నాహక సమావేశానికి అఖిలపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సమావేశంలో పాల్గొన్న అనంతరం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు.
Next Story

