Mon Feb 02 2026 03:20:51 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్ షోకు రెడీ అయిన చంద్రబాబు
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటిస్తున్నారు

కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటిస్తున్నారు. మూడో రోజు షెడ్యూల్ లో రోడ్ షోలకు సిద్ధమయ్యారు. తాను రోడ్ షో చేసి తీరుతానని చంద్రబాబు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ఇందుకు అనుమతి లేదని చెబుతున్నారు.
కుదరదంటున్న పోలీసులు...
దీంతో కుప్పంలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు బస చేసిన ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రోడ్ షోలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు చెబుతున్నారు. చేసి తీరుతామని టీడీపీ నేతలు అంటున్నారు. పెద్ద యెత్తున టీడీపీ శ్రేణులు కుప్పంకు తరలివస్తుండటంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Next Story

