Thu Dec 18 2025 13:46:10 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజు కుప్పంలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కుప్పం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా జరగింది. ఈ నేపథ్యంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన కేవలం ఇన్డోర్ సమావేశాలకే పరిమితం కానుంది.
కార్యకర్తలతో...
ఈరోజు కుప్పం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతారని పార్టీవర్గాలు తెలిపాయి. బహిరంగసభ,రోడ్ షోలకు అనుమతి నిరాకరించడంతో చంద్రబాబు ఇంటింటికి తిరుగుతూ అందరినీ పలుకరిస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నామని చంద్రబాబు తెలిపారు. ఈరోజు కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

