Sat Dec 06 2025 02:12:17 GMT+0000 (Coordinated Universal Time)
కందుకూరులోనే చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా కందుకూరులోనే ఉన్నారు. నిన్న జరిగిన ఘటనతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా కందుకూరులోనే ఉన్నారు. నిన్న జరిగిన ఘటనతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎనిమిది మంది పార్టీ కార్యకర్తలు తొక్కిసలాటలో చనిపోవడంతో ఈరోజు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే అవకాశాలున్నాయి. మృతుల కుటుంబాలను ప్రత్యేకంగా కలుసుకుని వారిని పరామర్శించడమే కాకుండా వారికి పార్టీ తరపున భరోసా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
కార్యక్రమాలు రద్దు....
ఈరోజు కందుకూరులో ఉన్న కార్యక్రమాలన్నింటినీ చంద్రబాబు రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారి అంత్యక్రియలను దగ్గరుండి చూసుకోవాలని పార్టీ నేతలను ఇప్పటికే చంద్రబాబు పురమాయించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు.ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయన బయలుదేరి కావలికి వెళ్లే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.
Next Story

