Sat Mar 07 2026 16:51:37 GMT+0530 (India Standard Time)
బాబు పర్యటనకు పోలీసుల బ్రేక్?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గుంటూరు జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు గుంటూరు జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు. మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్య హత్యకు గురయ్యారు. చంద్రబాబు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ హత్య వైసీపీ నేతలు చేసిందేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందన్న ఆరోపణలు చేస్తున్నారు.
మాచర్ల వెళ్లేందుకు....
ీఈ నేపథ్యంలో చంద్రబాబు మాచర్ల వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే పోలీసులు చంద్రబాబు మాచర్ల పర్యటనకు అనుమతిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. చంద్రబాబు మాత్రం అక్కడకు వెళ్లి పార్టీ క్యాడర్ కు ధైర్యం నూరిపోసి, బాధిత కుటుంబాన్ని పరామర్శించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
Next Story

