Thu Mar 19 2026 04:28:14 GMT+0530 (India Standard Time)
ఇది ఉన్మాదం కాక మరేంటి?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఎండాకాలం ప్రారంభంలోనే కరెంట్ కోతలతో రాష్ట్రం అల్లాడి పోతుందన్నారు. కానీ జగన్ మాత్రం వాలంటీర్లకు సన్నానం పేరుతో 233 కోట్ల రూపాయలను తగలేసి పండగ చేసుకుంటున్నారని, ఇంతకంటే ఉన్నాదం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికే చేతకాని ప్రభుత్వం నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ చీకట్లోకి వెళ్లిపోయిందని అన్నారు.
విద్యుత్తు కోతలతో....
ఎండాకాలంలో విద్యుత్తు కోతలు విధిస్తూ ప్రజలను నరకయాతన పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. చివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్తు లేక రోగులు అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మిగులు విద్యుత్తుతో ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ కోతలు ఎందుకు వచ్చాయో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.
Next Story

