Thu Mar 19 2026 08:54:21 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఏసీబీ కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో సీఐడీ అధికారుల తరుపున న్యాయవాదులు పీటీ వారెంట్లు వేశారు. అయితే ఏసీబీ న్యాయస్థానం ఈ పీటీ వారెంట్లను రెండింటినీ తోసిపుచ్చింది.
బెయిల్ పై ఉన్నందున...
చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పై ఉన్నందున పీటీ వారెంట్లు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అవకతవకలు జరిగాయని, ఫైబర్ నెట్ కేసులో పెద్దయెత్తున నిధులు దుర్వినయోగమయిందని ఆరోపిస్తూ ఆ కేసుల్లో సీఐడీ చంద్రబాబును నిందితుడిగా చేర్చింది. ఆయనను విచారించేందుకు అనుమతిని కోరుతూ పీటీ వారెంట్లు దాఖలు చేసింది.
Next Story

