Thu Mar 19 2026 06:28:39 GMT+0530 (India Standard Time)
Chandrababu : వాలంటీర్లకు చంద్రబాబు బిగ్ ఆఫర్
వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిగ్ ఆఫర్ ఇచ్చారు.

వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిగ్ ఆఫర్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే వేతనాన్ని పెంచుతామని చెప్పారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ హామీని వాలంటీర్లకు ఇచ్చారు. సేవ చేసే వాలంటీర్లను తొలగించబోమన్న చంద్రబాబు వారిని కొనసాగిస్తామని ప్రకటించారు.
పది వేల జీతాన్ని...
తాము అధికారంలోకి వస్తే ఐదు వేల రూపాయల వేతనాన్ని పది వేలకు పెంచుతామని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని.. వారిని కొనసాగిస్తామని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
Next Story

