Sun Dec 28 2025 16:42:38 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన నేతల అరెస్ట్ లు అన్యాయం
జనసేన నేతల అక్రమ అరెస్ట్ లను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు

జనసేన నేతల అక్రమ అరెస్ట్ లను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలు దుర్మార్గంగా ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ లో సోదాలు నిర్వహించడం, నేతలను అరెస్ట్ చేయడం నియంత పాలనకు నిదర్శనమని తెలిపారు.
హత్యాయత్నం కేసులు...
విమానాశ్రయం నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ అభిమానులు ర్యాలీగా వస్తే అరెస్ట్ చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్ లు చేయడం ఏంటని ప్రశ్నించారు. వారిని వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హత్యాయత్నం కింద కేసులు పెట్టడమేంటని చంద్రబాబు నిలదీశారు. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో? బయటకు రావాలో పోలీసులు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.
Next Story

