Tue Dec 30 2025 00:18:11 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?
ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో పదిహేను మంది చనిపోతే పట్టించుకోలేదన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే నంద్యాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని చెప్పారు. నాసిరకం భోజనం పెట్టడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చంద్రబాబు చెప్పారు.
ప్రాణాలు పోతున్నా.....
ప్రజలు ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వం స్పందించపోవడం విచారకరమని చంద్రబాబు అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లనే ప్రాణ నష్టం జరుగుతుందని చంద్రబాబు మండి పడ్డారు.
Next Story

