Sat Jan 31 2026 18:48:04 GMT+0000 (Coordinated Universal Time)
చలో అసెంబ్లీ - ఎక్కడ నేతలు అక్కడే?
జీవో నెంబరు వన్ ను రద్దు చేయాలంటూ తెలుగుదేశం, వామపక్ష పార్టీలు నేడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి

జీవో నెంబరు వన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, వామపక్ష పార్టీలు నేడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. అయితే పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్నారు. విజయవాడ బయలుదేరిన నేతలను జిల్లాల్లోనే అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న రాత్రే అనేక మంది వామపక్ష, టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అనుమతి లేదన్న...
ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు కూడా పాల్గొననుండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని, వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అనుమతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story

