Mon Mar 16 2026 20:03:54 GMT+0530 (India Standard Time)
హరీశ్.. ఇవన్నీ నీకు కనపడలేదా?
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ తప్పు పట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అభివృద్ధి సాధించిన విషయం హరీష్ రావుకు తెలేదా? అంటూ ఎద్దేవా చేశారు. భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అంటూ సెటైర్ వేశారు.
సైటైరికల్ గా....
ఆదానీకి ఏపీలోని పోర్టులు, విద్యుత్ ఒప్పందాలు, వేలాది ఎకరాల భూములు కట్టబెట్టి ఆదానీని అభివృద్ధి చేయటం కనపడలేదా? అంటూ హరీశ్ రావును సీపీఐ రామకృష్ణ వెనకేసుకొచ్చే ప్రయత్నంచేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలువంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పటం గమనించలేదా? అంటూ వ్యంగంగా విమర్శలుచేశారు. ఇన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా ఏపీలో అభివృద్ధి లేదని హరీష్ రావు చెప్పటం హాస్యాస్పదమనని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
Next Story

